సిఎం కెసిఆర్‌ గవర్నర్‌తో భేటీ..ఆర్టీసి సమ్మెపై చర్చ?

Tamilisai Soundararajan & KCR
Tamilisai Soundararajan & KCR

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్‌ మరికాసేపట్లో కలవనున్నారు. ఆమెతో పలు కీలకమైన అంశాలపై చర్చించనున్నట్లు కీలక సమాచారం. అయితే అది ఆర్టీసి సమ్మెపై సిఎం కెసిఆర్‌ నిర్ణయాన్ని గవర్నర్‌కు వివరణ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఆర్టీసి సమ్మె, దాని తర్వాత పరిణామాలపై సిఎం, గవర్నర్‌ తమిళిసైకు వివరించే అవకాశం ఉన్నట్లుగా తెలస్తోంది. అంతేకాకుండా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు, దానిపై కూడా గవర్నర్‌కు వివరించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సిఎం కెసిఆర్‌ ఏయే అంశాలపై ఆమెతో చర్చిస్తారు? ఈ సమావేశం అనంతరం ఆర్టీసిపై తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారా? అనే అంశాలపై ఉత్కంఠ నెలకొంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/