సిఎం కెసిఆర్‌ బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష

cm kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో 2020-2021 బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష నిర్వ‌హించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలు, సవరించాల్సిన అంశాలపై కూలంకషంగా చర్చిస్తున్నారు. ఈ స‌మావేశానికి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థికశాఖ అధికారులు హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశం ముగిసిన అనంత‌రం సాయంత్రం యాదాద్రి దేవాలయ నిర్మాణ పనుల్లో పురోగతిపై సైతం సిఎం కెసిఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. సమావేశానికి వైటీడీఏ స్పెషల్‌ ఆఫీసర్‌, యాదాద్రి కలెక్టర్‌, రోడ్లు భవనాలశాఖ అధికారులు, ఆలయ ఈవో హాజరుకానున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/