నేడు హుజూర్‌నగర్‌లో కెసిఆర్‌ కృతజ్ఞత సభ

CM KCR
CM KCR

హైదరాబాద్: హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన క్రమంలో హుజూర్‌నగర్‌లో సిఎం కెసిఆర్‌ హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన క్రమంలో హుజూర్‌నగర్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ కృతజ్ఞత సభ శనివారం నిర్వహిస్తున్నారు. అధికార టిఆర్‌ఎస్‌కు అద్భుతమైన విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు సిఎం కెసిఆర్ ధన్యవాదాలు చెప్పనున్నారు. హుజూర్‌నగర్ పట్టణంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ రోడ్డులో వాసవీ భవన్ సమీపంలో ఈ సభ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి మధ్యాహ్నం సూర్యాపేటలో భోజనం చేసిన తరువాత రోడ్డు మార్గం గుండా కోదాడ నుంచి హుజూర్‌నగర్ చేరుకుంటారు. సాయ ంత్రం 4 గంటలకు సభా వేదికపై నుంచి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఇందుకు అనుకూలమైన ఏర్పాట్లను ముఖ్యనేతలు పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు నియోజకవర్గమైన హుజూర్‌నగర్ ప్రజలు ప్రగతిశీల భావాలు కలవారు. ఒకప్పటి కవి, విమర్శకులు మగ్ధుం మోహినుద్దీన్‌ను గెలిపించిన ప్రజలు ఆ తరువాత కాంగ్రెస్పార్టీకే అవకా శం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏ ర్పాటైన తరువాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌నే గెలిపించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/