సాగర్ నియోజకవర్గానికి రూ.15 కోట్లు: సీఎం కెసిఆర్

హాలియా బహిరంగ సభలో సీఎం కేసీఆర్

నల్గొండ : సీఎం కెసిఆర్ సాగర్‌ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. సాగర్ నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు. ‘కరోనా వల్ల జిల్లా పర్యటనకు రావడం ఆలస్యమైంది. నేను కూడా కరోనా బారిన పడ్డా. సాగర్‌ నియోజకవర్గంలో చాలా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. మౌలిక సదుపాయల సమస్యను పరిష్కరించాల్సిన ఉంది. నందికొండ మున్సిపాలిటీలో ఇళ్లన్నింటినీ రెగ్యులరైజ్‌ చేస్తాం. నందికొండలో జాగాలున్నవారికి పట్టాలు మంజూరు చేస్తాం. హాలియాను అద్భుతంగా తీర్చిదిద్దుతాం. గుర్రంపోడు లిఫ్ట్‌ సర్వే చేపట్టాలని అధికారుల్ని ఆదేశించాను. హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల చొప్పున నిధులు ఇస్తా. సాగర్‌ నియోజకవర్గంలోని ఆరోగ్యకేంద్రాలు, ఆస్పత్రులను అభివృద్ధి చేస్తాం. హాలియాలో డిగ్రీ కాలేజ్‌, మినీ స్టేడియం ఏర్పాటు చేస్తాం’ అని కేసీఆర్‌ వరాలు కురిపించారు.

నాగార్జునసాగర్ నియోజకవర్గానికి అభివృద్ధి రుచి చూపిస్తాం. దేశానికే ఆదర్శంగా 24 గంటల విద్యుత్ ఇచ్చాం. జానారెడ్డి మాట తప్పి సాగర్‌లో పోటీ చేశారు. దళితబంధు పథకంపై ఎన్నో విమర్శలు చేస్తున్నారు. 12లక్షల దళిత కుటుంబాలకు పథకాన్ని అందిస్తాం. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల ఆర్ధిక సాయం తప్పకుండా చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో వంద కుటుంబాలకు ఈ ఏడాది దళితబంధు అమలు చేస్తాం. దళితబంధు పథకంతో విపక్షాలకు బీపీ మొదలైందని సీఎం కేసీఆర్‌ అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/