మాకు రాజకీయాలంటే గేమ్ కాదు ఒక టాస్క్: సీఎం కెసిఆర్

CM kcr speech in assembly

హైదరాబాద్ : నేడు తెలంగాణ సమాజం అంతులేని వివక్షతో నలిగిపోయిందని సీఎం అన్నారు. 2014 సంవత్సరంలో తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు ఇదే పరిస్థితి ఉండేదని కెసిఆర్ చెప్పారు. సీఎం కెసిఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. పై వాక్యాలు చేసారు.
తెలంగాణలో ఉద్యోగాలు రావడం లేదని యువత తీవ్రమైన దిగ్బ్రాంతికి గురి అయ్యారు. కొంత మందితో ఉద్యమాన్ని ప్రారంభించామని సీఎం అన్నారు. ప్రజల దీవెనలతో, సుదీర్ఘమైన యుద్ధం తర్వాత రాష్ట్రం సాకారమైందన్నారు. తెలంగాణ ఏర్పాటు దేశ చరిత్రలోనే ముఖ్యమైన ఘట్టమని చెప్పారు.

ఈ మధ్య రాజకీయాల్లో విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయని సీఎం కెసిఆర్ అన్నారు. ఇతర పార్టీవాలకు,వ్యక్తులకు రాజకీయాలంటే ఒక గేమ్ అని.. మాకు మాత్రం ఒక టాస్క్ అని అన్నారు. మేము దీనిని ఒక దేవాలయంలాగా భావిస్తాము. ఏ విషయానైనా సీరియస్ గా తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ప్రజలకు మెంఏంటో, మేమేం చేసామో తెలుసని చెప్పారు. ఉద్యమాల వల్ల నమోదైన కేసులో మా మంత్రులు కూడా ఉన్నారు. నేడు ప్రధాన సమస్యగా నీళ్లు, నిధులు, నియమాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బాషా పరిరక్షణ జరిగిందన్నారు. ఇప్పుడు సినిమాల్లో హీరోలు కూడా తెలంగాణ బాషలోనే మాట్లాడడంవల్ల క్రేజ్ పెరుగుతుందన్నారు.. ఒకప్పుడు తెలంగాణ బాషాని జోకర్లకు వాడేవారని సీఎం వ్యాఖ్యానించారు.

తాజా ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/