రాష్ట్రంలో స‌ర్పంచులు గౌర‌వంగా బ‌తుకుతున్నారు

గ‌త ప్ర‌భుత్వాల హ‌యాంలో స‌ర్పంచులకు ఎన్నో ఇబ్బందులు: కేసీఆర్

హైదరాబాద్: సీఎం కెసిఆర్ గ్రామ పంచాయ‌తీ నిధులపై శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా మాట్లాడుతూ… తెలంగాణ‌లోని గ్రామాల‌ను చూసి ఇత‌ర రాష్ట్రాల్లోని గ్రామాల ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్య‌పోతున్నార‌ని అన్నారు. గ‌త ప్ర‌భుత్వాల హ‌యాంలో స‌ర్పంచులు ఎన్నో ఇబ్బందులు ప‌డ్డార‌ని ఆయ‌న చెప్పారు. త‌మ ప్ర‌భుత్వ పాల‌న‌లో స‌ర్పంచుల‌కు ఎలాంటి ఇబ్బందులూ లేవ‌ని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో స‌ర్పంచులు గౌర‌వంగా బ‌తుకుతున్నార‌ని చెప్పారు. గ్రామాల్లో ప్ర‌జ‌లకు అన్ని సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు. మ‌న స‌ర్పంచ్‌ల‌ను కేంద్ర మంత్రులు ప‌లువురు ప్ర‌శంసించారు. కొన్ని సంద‌ర్భాల్లో ప్ర‌ధాని, నీతి ఆయోగ్ కూడా ప్ర‌శంసించి అనేక అవార్డులు ఇచ్చింది. ముఖ్రా కే గ్రామానికి అవార్డు వ‌చ్చింది. దాదాపు రెండు గంట‌ల పాటు పంచాయ‌తీరాజ్ చ‌ట్టం గురించి వివ‌రించ‌డం జ‌రిగింది.

కాగా, తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. తెలంగాణ‌లో గులాబ్ తుపాను ప్ర‌భావంతో కురిసిన భారీ వర్షాలకు పంట నష్టం వాటిల్లింద‌ని కాంగ్రెస్ తెలిపింది. న‌ష్ట‌పోయి స‌మ‌స్య‌ల్లో ప‌డ్డ‌ రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంద‌ని పేర్కొంది. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అసెంబ్లీలో ఆ అంశాల‌ని చర్చించాలని కాంగ్రెస్ కోరింది. అంత‌కు ముందు శాస‌న‌స‌భ‌లో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రశ్నోత్త‌రాలు ప్రారంభించారు. స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు హ‌రీశ్ రావుతో పాటు ప‌లువురు మంత్రులు స‌మాధానం ఇచ్చారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/