జగిత్యాల కలెక్టరేట్‌ను ప్రారంభించిన సిఎం కెసిఆర్

జగిత్యాలః సిఎం కెసిఆర్ జగిత్యాల జిల్లాలో రూ. 49 కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాంబర్‌లోని సీట్లో కలెక్టర్ జీ రవిని కూర్చోబెట్టి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సిఎం కెసిఆర్ ప్రసంగించారు. మంచి చక్కటి పరిపాలన భవనాన్ని నిర్మించుకుని నా చేతుల మీదుగా ప్రారంభించుకున్నందరకు ప్రజాప్రతినిధులకు, అదికారులకు, ప్రజలకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని కేసీఆర్ తెలిపారు. నూతన కలెక్టరేట్‌లలో ఇది 14వ కలెక్టరేట్. మిగతావికి కూడా త్వరలోనే ప్రారంభం చేసుకోబోతున్నాం. తెలంగాణ ఉద్యమ సందర్భంలో అనేకసార్లు మీ వద్దకు వచ్చాను. రాజకీయ నాయకులుగా ఉద్యమం చేసే సందర్భంలో మీరు కూడా పెన్ డౌన్ చేసి తెలంగాణ కోసం పోరాటం చేశారు. తెలంగాణ ఏర్పడుతుంది. దీనికి మంచి అవకాశాలు ఉన్నాయి. ధనిక రాష్ట్రం అవుతుందని నాడే చెప్పాను. అత్యుత్తమ శాలరీలు వస్తాయని చెప్పాను. అది నిజమైంది. ఎవర్నీ వదలకుండా అన్ని వర్గాలు ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామని కెసిఆర్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ. 62 వేల కోట్ల బడ్జెట్ ఉంటే.. ఈసారి రూ. 2 లక్షల 20 వేల కోట్లు దాటిపోనుందని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. పరిపాలన చేసే వారు రాజ్య కార్యాన్ని నిర్వహించే వారు న్యాయ మార్గంలో పరిపాలించాలని చెప్పారు. జనమంతా సుకంగా ఉండాలని కోరుతారు. బేధాభిప్రాయం లేకుండా తెలంగాణ మనదే అని చెప్పి అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. విజయవంతం అయ్యాయి. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. రాష్ట్రం ఏర్పడప్పుడు అనిశ్చిత స్థితి. కరెంట్ బాధలు, సాగునీళ్లు లేవు. వలసలు, కరువు. కారు చీకట్లలాంటి పరిస్థితి. కానీ అన్ని సమస్యలను అనతి కాలంలోనే అధిగమించామని చెప్పారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/