యూనియన్లే కార్మికుల గొంతు కోస్తున్నాయి. కెసిఆర్‌

cm kcr press meet
cm kcr press meet

హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో చాలా రోజులు మీడియాకు దూరంగా ఉన్న కెసిఆర్‌ హుజుర్‌నగర్‌ జరిగిన టిఆర్‌ఎస్‌ గెలుపుతో కెసిఆర్‌ మీడియా ముందుకు వచ్చారు. కార్మికుల వేతనాలు గడిచిన నాలుగు సంవత్సరాలలో 67 శాతం పెంచామని దేశంలో ఎక్కడైనా పెంచారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 57 కార్పొరేషన్లు ఉన్నాయి ఇపుడు ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తే మిగతా కార్పోరేషన్లు కుడా విలీనం చేయాలని కోరితే ఎంచేయాలి? అని ముఖ్యమంత్రి కార్మికులను ప్రశ్నించారు. ఆర్టీసీ యూనియన్‌ ఎలక్షన్‌ల ముందు జరిగే హడావుడే ఈ సమ్మెకు కారణం డ్రైవర్లు, కండక్టర్లతో నాకు పంచాయితీ లేదు యూనియన్లే సమ్మె ముసుగులో అమాయక కార్మికుల గొంతు కోస్తున్నాయి అన్నారు. ఇప్పటికైనా యూనియన్లకు, ప్రతిపక్షపార్టీలకు దూరంగా ఉండి వచ్చి డ్యూటీ ఎక్కితే రెండెళ్లలో కార్మికులకు లక్ష రూపాయలు బోనస్‌ ఇస్తాము అని చెప్పారు. తెలంగాణ కోసం ఆర్టీసీ ఒకటె కాదు ప్రతి ఒక్కరూ పని చేశారు అని గర్తు చెసారు. ఆర్టీసీ సమ్మెకాదు ఆర్టీసీ నే ముగిసిపోతుంది కోత్త ఆర్టీసీ వస్తుందని కెసిఆర్‌ హెచ్చరించారు.

తాజా జాతీయ వార్తలకోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/