ఆర్టీసిపై సమీక్ష నిర్వహించిన సిఎం కెసిఆర్‌

CM KCR
CM KCR

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆర్టీసి సమస్యకు ఒక ముగింపు పలికేందుకు మరోమారు సమీక్ష నిర్వహించారు. మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసి, రవాణా శాఖ అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆర్టీసి కార్మికులపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలన్న విషయంపై సిఎం కెసిఆర్‌ అధికారులతో చర్చించారు. ఒకపక్క ఆర్టీసి కార్మికులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించి ఈ రోజు నుంచి విధుల్లో చేరేందుకు సముఖత చూపారు. అయితే ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, ఆర్టీసి యాజమాన్యం అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులతో చర్చించిన సిఎం వారికి దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా ప్రైవేటు బస్సుల అంశంపై తదుపరి కార్యచరణకు ప్రక్రియ చేపట్టాలని అధికారులను సిఎం కెసిఆర్‌ ఆదేశించినట్లు సమాచారం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/