పల్లె ప్రగతిపై ఆకస్మిక తనిఖీలు చేయనున్న కెసిఆర్‌

CM KCR
CM KCR

హైదరాబాద్‌: తెలంగాణ సిఎం కెసిఆర్‌ పల్లెప్రగతి కార్యక్రమాల పనితీరును పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రత్యేక బృందాలు పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాలని సూచించారు. నేడు ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పచ్చని పల్లెల ప్రగతికి, స్వచ్ఛతకు అద్దం పట్టేలా పరిశుభ్రమైన పల్లెల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని గుర్తు చేశారు. చేపట్టిన 30 రోజుల్లోనే పల్లె ప్రగతి కార్యక్రమం విశేష జనాదరణ పొందిదని సిఎం కెసిఆర్‌ చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/