బజాజ్ సేవలను గుర్తు చేసుకున్న సిఎం

బయోటెక్ రంగ ప్రముఖుడు బీఎస్ బజాజ్ మృతిపై సిఎం సిఎం కెసిఆర్ విచారం

cm kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ బయోటెక్ రంగ ప్రముఖుడు డాక్టర్ బీఎస్ బజాజ్ (93) మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో బయోటెక్నాలజీ రంగం అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడిన బీఎస్ బజాజ్, జీనోమ్ వ్యాలీ, బయో ఆసియా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని కీర్తించారు. బజాజ్ మృతి పట్ల సిఎం కెసిఆర్ స్పందిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఏషియన్ బయోటెక్ అసోసియేషన్స్ సమాఖ్యకు ఆయన వ్యవస్థాపక కార్యదర్శిగా వ్యవహరించారని, 2019లో జరిగిన బయో ఆసియా సదస్సులో ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు కూడా ఇచ్చామని సిఎం కెసిఆర్ గుర్తు చేసుకున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/