బోయిగూడ అగ్నిప్రమాదంపై సీఎం కెసిఆర్ దిగ్భ్రాంతి

బాధితులకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా

హైదరాబాద్ : సీఎం కెసిఆర్ సికింద్రాబాద్‌లోని బోయిగూడ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాల‌కు రూ. 5 ల‌క్ష‌ల చొప్పున సీఎం ప‌రిహారం ప్ర‌క‌టించారు. మృత‌దేహాల‌ను బీహార్‌కు పంపించే ఏర్పాట్లు చేయాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

కాగా, బుధ‌వారం తెల్ల‌వారుజామున టింబ‌ర్ డిపోలో చెల‌రేగిన మంట‌ల‌కు మొత్తం 11 మంది మృతి చెంద‌గా, ఒక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మృతుల్లో కొంద‌రు స‌జీవ‌ద‌హ‌నం కాగా, మ‌రికొంద‌రు ఊపిరాడ‌క ప్రాణాలు కోల్పోయారు. మృత‌దేహాల‌కు గాంధీ ఆస్ప‌త్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వ‌హిస్తున్నారు. గాయ‌ప‌డిన వ్య‌క్తికి కూడా గాంధీ ఆస్ప‌త్రిలోనే చికిత్స అందిస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/