కెసిఆర్‌కు విమానాశ్రయంలో ఘనస్వాగతం

kcr
kcr

తిరుపతి: తిరుమల, కంచి పర్యటనకు బయల్దేరిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. తన భార్య, కుమార్తె కవిత, కొందరు నేతలతో కలసి కేసీఆర్ ప్రత్యేక విమానంలో తిరుపతికి వెళ్లారు. ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో కేసీఆర్ కు ఘన స్వాగతం లభించింది. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు కేసీఆర్ కు స్వాగతం పలికారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుమల శ్రీవారిని కేసీఆర్ దర్శించుకోనున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో కంచికి బయల్దేరుతారు.
కాగా స్వామివారి దర్శనార్థం తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్యే రోజా ఇంటికి కెసిఆర్‌ వెళ్తారని తెలిసింది. కెసిఆర్‌ కుటుంబానికి ఎమ్మెల్యే రోజా విందు ఏర్పాటు చేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/