సిఎం కెసిఆర్‌ రేపటి పర్యటన షెడ్యూల్‌

ts cm kcr
ts cm kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ రేపటి జిల్లా పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఆయన రేపు హైదరాబాద్ నుంచి బయలుదేరి, రామగుండంలోని ఎన్టీపీసీకి సీఎం చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా పూర్తిగా స్వరాష్ట్ర అవసరాల కోసం రామగుండంలో నిర్మిస్తున్న తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. తరువాత జెన్‌కో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి ఎన్టీపీసీలోనే బస చేసి, 19వ తేదీ ఉదయం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి కన్నెపల్లి పంపుహౌస్, మేడిగడ్డ బ్యారేజీ పనులు పరిశీలిస్తారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/