ఈ గెలుపు ప్రభుత్వానికి ఓ టానిక్ లాంటిది

ఎల్లుండి హుజూర్ నగర్ లో కృతజ్ఞత సభ నిర్వహిస్తాం

CM KCR
CM KCR

హైదరాబాద్‌: హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ కు అద్భుత విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని సిఎం కెసిఆర్‌ అన్నారు. తెలంగాణభవన్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ గెలుపు ఆషామాషీ గెలుపు కాదని, ప్రజలు ఆలోచించి ఓట్లు వేశారని అన్నారు. ప్రజల కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి ఈ గెలుపు ఓ టానిక్ లాంటిదని, ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పారు. హుజూర్ నగర్ ఉపఎన్నికలకు ముందు నిర్వహించాల్సిన సభకు తాను హాజరుకాలేకపోయానని గుర్తుచేసుకున్నారు. ఇంత అద్భుత విజయాన్ని అందించిన ప్రజల కోసం ఎల్లుండి హుజూర్ నగర్ లో కృతజ్ఞత సభ నిర్వహిస్తామని అన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/