చిన్నప్పటి నుంచి మీ అభిమానిని

cm kcr-k-viswanath-house
cm kcr-k-viswanath-house

హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం సిఎం కెసిఆర్ ఫిల్మ్‌నగర్‌లోని కె.విశ్వనా థ్ ఇంటికి స్వయంగా వెళ్లి కలుసుకున్నారు. కె.విశ్వనాథ్, ఆయన సతీమణి జయలక్ష్మి, కొడుకు రవీంద్రనాథ్, కోడ లు గౌరి, దర్శకుడు ఎన్.శంకర్ తదితరులు స్వాగతం పలికారు. విశ్వనాథ్ దంపతులను ముఖ్యమంత్రి కెసిఆర్ పట్టువస్త్రాలతో సన్మానించారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులు కూడా ముఖ్యమంత్రిని సన్మానించారు. ముఖ్యమంత్రి వెం ట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంఎల్‌సి శేరి సుభాష్ రెడ్డి, టిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కె.విశ్వనాథ్ ఆరోగ్యం గురించి సిఎం ఆరా తీశారు.ఉన్నత విలువలతో కూడిన ఎన్నో గొప్ప చిత్రాలు తీసిన దర్శకుడు విశ్వనాథ్ ఆధ్వర్యంలో సమాజానికి మంచి సం దేశం అందించే మరో చిత్రం రావాలని ముఖ్యమంత్రి కె.చ ంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. విశ్వనాథ్ దర్శకుడయితే, నిర్మాణ పరమైన విషయాలు తాను చూసుకుంటానని మా టిచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, విశ్వనాథ్ మధ్య సినిమాలు, భాష, సాహిత్యం తదితర అంశాలపై గంటకు పైగా ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఙనేను మీ అభిమానిని. చిన్నప్పటి నుంచీ మీ సినిమాలంటే చాలా ఇష్టం. మీరు తీసి న ప్రతీ సినిమా చూశా. శంకరాభరణం అయితే 25 సార్ల కు పైగా చూసి ఉంటా. దాదాపు అన్ని సినిమాలు అలాగే చూశా. సినిమా చూసిన ప్రతీసారి మిమ్మల్ని ఓ సారి కలవాలనిపించేది. ఇన్నాళ్లకు ఆ కోరిక తీరింది. మీరు తీసే ప్రతీ సినిమా ఓ కావ్యంలాగా ఉంటుంది.

మీరు సినిమాలను తపస్సుతో తీస్తారు. అందులో వాడే భాషగానీ, పాటలు గానీ, కళాకారుల ఎంపిక గానీ, సన్నివేశాల చిత్రీకరణ గానీ, సం భాషణలు గానీ ప్రతీదీ గొప్పగా ఉంటాయి. కుటుంబం అంతా కూర్చుని చూసేలా ఉంటాయి. అందుకే ఇప్పటికీ వీలు దొరికితే మీ సినిమాలు చూస్తాను. మీపై ఉన్న అభిమానమే నన్ను మీ దగ్గరకి తీసుకొచ్చింది. మిమ్మ ల్ని కలవడం, మీతో మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ సినిమాలు రాక పదేళ్లయింది. సందేశాత్మక, గొప్ప సినిమాలు ఈ మధ్య రావడం లేదు. మీరు మళ్ళీ సినిమా తీయాలి. సహాయకుల ద్వారా మీ మార్గదర్శకత్వంలో సినిమా తీద్దామంటే నిర్మాణ బాధ్యతలు స్వీకరించడానికి నేను సిద్ధం. దయచేసి దీనికోసం ప్రణాళిక సిద్ధం చేయండిచ అని ముఖ్యమంత్రి కోరారు.

మా ఇల్లు పావనమైంది : విశ్వనాథ్

CM KCR K Vishwanath-family
CM KCR K Vishwanath-family


సిఎం కెసిఆర్ అడుగు పెట్టడంతో మా ఇల్లు పావనమైందని కె.విశ్వనాథ్ వ్యాఖ్యానించారు. ఙమీరే స్వయంగా మా ఇంటికి రావడం మా అదృష్టం. రాత్రి మీరు నాతో ఫోన్లో మాట్లాడి, ఇంటికి వస్తున్నానని చెబితే, ఎవరో గొంతు మార్చి మాట్లాడుతున్నార ని అనుకున్నాను. మీరే మాట్లాడారని తేల్చుకున్నాక రాత్రి 12 గంటల వరకు నిద్ర పట్టలేదు. మీరు చేసే పనులను, ప్రజల కోసం తపించే మీ తత్వాన్ని టీవీ ల్లో, పత్రికల్లో చూస్తున్నాను. నేరుగా చూడడం ఇదే మొదటి సారి. చాలా సంతోషంగా ఉంది. గతంలో మీలాగే ఒకసారి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజిఆర్ మాట్లాడారు. మళ్లీ మీ అంతటి వారు మా ఇంటి కి రావడం నిజంగా సంతోషంగా ఉందిచ అని విశ్వనాథ్ అన్నారు.

తన ఆరోగ్యం గురించి సిఎం కెసిఆర్ వాకబు చేసిన సందర్బంగా విశ్వనాథ్ ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఙఆరోగ్యం బాగానే ఉంది. కానీ మోకాళ్ల నొప్పులున్నాయి. ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు అంటున్నారు. కానీ నాకు ఆపరేషన్ అంటే భయం. అసలు హాస్పిటల్ అంటేనే భయం. నా సినిమాల్లో కూడా ఎక్కడా ఆసుపత్రి సీన్లు పెట్టను. రక్తం అంటే భయం. ఇక నేనేమి ఆపరేషన్ చేయించుకుంటాను. ఇలాగే గడిపేస్తాచ అని విశ్వనాథ్ చెప్పారు. ఙమీకు తెలుగు భాషపైనా, సాహిత్యంపైనా మంచి పట్టుంది. ప్రపంచ తెలుగు మహాసభలను గొప్పగా నిర్వహించారు. మీరు చక్కగా మాట్లాడతారు. మంచి కళాభిమాని కూడాచ అంటూ విశ్వనాథ్ సిఎంను అభినందించారు. సాహిత్యాభిలాష ఎలా పుట్టిందని విశ్వనాథ్ అడిగిన ప్రశ్నకు, చిన్నప్పటి నుంచి తన గురువుల సాంగత్యం గురించి కెసిఆర్ వివరించారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/