ప్రొఫెసర్ జయశంకర్‌కు సీఎం కేసీఆర్ నివాళి

తెలంగాణ చరిత్రలో చిరకాలం నిలిచిపోతారు..కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ ఉద్య‌మ‌కారుడు ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి సందర్భంగా సీఎం కెసిఆర్ ఆయనకు ఘన నివాళి అర్పించారు. తెలంగాణ స్వయం పాలనా స్వాప్నికుడు, స్వరాష్ట్రం కోసం సాగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ చరిత్రలో చిరకాలం నిలిచిపోతారని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణలో పెడుతున్నదని, జయశంకర్ ఆలోచనలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలు స్వయం సమృద్ధిని సాధిస్తున్నాయని సీఎం అన్నారు. ఒక్కొక్క రంగాన్ని సరిదిద్దుకుంటూ, దేశంలోని ఇతర రాష్ట్రాలతో అభివృద్ధిలో తెలంగాణ పోటీపడుతున్నది. నూతన తెలంగాణ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే జయశంకర్‌కు నిజమైన నివాళి అని సీఎం తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/