శ్రీశైలం ప్రమాదంపై సీఐడీ విచార‌ణ‌కు సిఎం ఆదేశం

cm kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన ప్రమాదంపై సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు వెలికి తీయాలని, అందుకు దారి తీసిన పరిస్థితులు బయటకు రావాలని సిఎం కెసిఆర్‌ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఐడీ అడిషనల్ డీజీపీ గోవింద్ సింగ్‌ను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాగా ప్రమాదంలో ప్రాణనష్టం జరగడంపైసిఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/