కొత్త ఇంట్లోకి సిఎం కెసిఆర్‌ గృహప్రవేశం

CM KCR
CM KCR

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో కొత్త ఇంటిని నిర్మిస్తున్న సిఎం కెసిఆర్‌… మంచి రోజులు ముగుస్తున్నాయనే కారణంగా ఈ రోజు ఉదయం కుటుంబసభ్యులతో కలిసి గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి కెసిఆర్‌ కుటుంబసభ్యులతో పాటు కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు తెలుస్తోంది. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో ప్రస్తుతం ఉన్న ఇంటి పక్కనే ఈ కొత్త ఇంటి నిర్మాణం జరిగినట్టు సమాచారం. కొత్త ఇంట్లో గృహప్రవేశం తరువాత మరోసారి వ్యవసాయ క్షేత్రంలో యాగం చేయాలని కెసిఆర్‌ నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపించాయి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/