17న గోదావరి నదీ జలాల వినియోగంపై సమావేశం

ఉదయం 11 గంటల నుంచి రోజంతా సమావేశం

TS CM KCR
TS CM KCR

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ గోదావరి నదీ జలాలను సమర్థంగా వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించడం కోసం ఈ నెల 17న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి గోదావరి ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాలకు చెందిన మంత్రులు, అధికారులు హాజరు కానున్నారు. ఈ సమావేశం ఉదయం 11 గంటల నుంచి రోజంతా కొనసాగుతుందని తెలంగాణ సీఎంవో వెల్లడించింది. కాగా, ఈ వర్షాకాలంలో గోదావరి ప్రాజెక్టుల నుంచి నీరు ఎప్పుడు, ఎంత మేర విడుదల చేయాలి? ఎస్సారెస్పీ, ఎల్ఎండీలకు నీళ్లు ఎప్పుడు తరలించాలి? మిగిలిన రిజర్వాయర్లకు నీటిని ఎప్పుడు తరలించాలి? నీటిని ఎలా వినియోగించుకోవాలి? అనే అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/