ఆర్టీసి కార్మికులకు సిఎం కెసిఆర్‌ వరాలు

CM KCR
CM KCR

హైదరాబాద్: ఆర్టీసి కార్మికులతో ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వరాలు కురిపించారు. రాష్ట్రంలోని ఒక్కో డిపో నుంచి ఐదుగురు చొప్పున కార్మికులంతా ప్రగతిభవన్‌లో సిఎంతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కెసిఆర్, కార్మికుల రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు పెంచేందుకు కెసిఆర్ అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు పెండింగ్‌లో ఉన్న సెప్టెంబర్ నెలతోపాటు సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలు కూడా చెల్లిస్తామని కార్మికులకు సిఎం హామీ ఇచ్చినట్టు కీలక సమాచారం. మహిళా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని, వారికి ప్రసూతి నెలల వేతనాలు అందజేస్తామని కెసిఆర్ పేర్కొన్నట్లు సమాచారం. ఆర్టీసి కార్మికలు కష్టపడి పనిచేయాలని, ప్రభుత్వ సహకారం, సింగరేణి తరహాలో మంచి బోనస్ లు కూడా అందుతాయని, ఆర్టీసి అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని సిఎం కెసిఆర్ భరోసా కల్పించినట్లు తెలుస్తోంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/