గోదావరి నదిలో నాణేలను వదిలిన సిఎం

kcr
kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ మేడిగడ్డ బ్యారేజి నిర్మాణ పనులను ఈరోజు క్షేత్రస్థాయిలో ప్రత్యేక్షంగా పరిశీలించారు. అనంతరం సిఎం కాలినడకన గోదావరి జల్లాలోకి ప్రవేశించారు. నీళ్లలోకి ప్రవేశించిన తరువాత సిఎం తన వెంట ఉన్నవారికి నాణేలను పంచి ఇచ్చారు. అందరూ కలిసి గోదావరి పుణ్యజలాల్లో నాణేలను వదిలి గోదావరి మాతకు నమస్కరించుకున్నారు. సిఎం వెంట మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌, ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/