నీటిపారుదల శాఖ అధికారులకు కీలక ఆదేశాలు

నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో ఉన్న రైతులకు నీరు..సిఎం

cm kcr

హైదరాబాద్‌: నాగార్జున సాగర్‌ ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయాలని సిఎం కెసిఆర్‌ నీటిపారుదల శాఖ అధికారులను ఆయన ఆదేశించారని తెలంగాణ సీఎంవో ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ రోజు నుంచే నీటి విడుదల ప్రారంభం కావాలని నాగార్జున సాగర్ సీఈని ఆదేశించారని వివరించింది. ‘కృష్ణానది ఎగువన నీటి ప్రవాహం ఆశాజనకంగా ఉన్నందున, ఈ సారి వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉన్నందున నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో ఉన్న సాగర్‌ ఆయకట్టు రైతులకు ఈ వానాకాలం పంటలకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పారు’ అని తెలంగాణ సీఎంవో ట్వీట్ చేసింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/