అమ్మవారికి బోనం సమర్పించిన్న సిఎం కెసిఆర్‌, కవిత

cm kcr, kavitha
cm kcr, kavitha

హైదరాబాద్‌: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలపండుగ సందర్భంగా సిఎం కెసిఆర్‌ మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర పోలీస్ కమిషనర్ అంజని కుమార్ స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న సిఎం కెసిఆర్ పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ నిర్వాహకులు సిఎంను ఘనంగా సన్మానించారు.

మరోవైపు కల్వకుంట్ల కవిత కూడా స్థానిక టిఆర్‌ఎస్ మహిళా నాయకులు, జాగృతి సభ్యులతో కలిసి సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా కవితకు స్వగతం పలుకుతూ పోతరాజుల నృత్యప్రదర్శనలు, శివసత్తుల పూనకాలతో ఆలయ పరిసరాలు అమ్మవారి నామస్మరణతో మారు మోగాయి. వందలాధి మహిళలతో కలిసి బోనాల జాతరలో పాల్గొన్నకవితకు ఆలయమర్యాదలతో ఆహ్వానించి ప్రత్యేకపూజలు చేశారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/