నేడు కామారెడ్డికి సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ నేడు కామారెడ్డి జిల్లాలో పర్యటించబోతున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌లోని తిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.

ఉదయం 10గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి సీఎం కేసీఆర్ కామారెడ్డి జిల్లా పర్యటనకు బయల్దేతారు. 10.40గంటలకు బాన్సువాడకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తిమ్మాపూర్‌లోని తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న కల్యాణోత్సవాల్లో పాల్గొంటారు. ఆలయంలోని శ్రీదేవి,భూదేవి సమేత వెంకటేశ్వరస్వామికి కల్యాణోత్సవాన్ని తిలకిస్తారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ముఖ్యమంత్రి కేసీఆర్. కల్యాణోత్సవం ముగియగానే తిరిగి మధ్యాహ్నం 1.30నిమిషాలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

తిమ్మాపూర్​లోని ఎత్తయిన గుట్టపై చిన్నగా వేంకటేశ్వరుడి ఆలయం ఉండేది. స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి 2015లో గుట్టపై గుడి కట్టి విగ్రహాల ప్రతిష్ఠాపన చేశారు. అప్పటి నుంచి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఆలయానికి సీఎం కేసీఆర్​ రావడం ఇది రెండో సారి. 2016లో జరిగిన స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. అప్పుడు అభివృద్ధి పనుల కోసం రూ. 23 కోట్ల ఫండ్స్​ కేటాయించారు. ఈ ఫండ్స్​తో రాజగోపురం, మాడవీధులు, యాగశాల, కల్యాణ మండపం, భక్తుల కోసం గెస్ట్​హౌజ్​లు, కొనేరు , కొండపైకి రోడ్ల నిర్మాణం జరిగింది.