మెట్రో రైల్‌ కారిడార్‌ను ప్రారంభించిన సిఎం కెసిఆర్‌

metro
metro

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ జూబ్లి బస్టాండ్ మహాత్మాగాంధీ బస్టాండ్ మధ్య నిర్మించిన మెట్రో కారిడార్‌ ప్రారంభించారు. పచ్చ జెండా ఊపిన సీఎం కేసీఆర్ రైలును ప్రారంభించారు. ఈ మార్గం మొత్తం 11 కిలోమీటర్లు ఉంటుంది. అందులో 9 స్టేషన్లు ఉన్నాయి. జేబీఎస్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, ఎంజీబీఎస్ చేరుకుంటుంది. 16 నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటుంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/