కేసిఆర్‌కు గన్నవరంలో స్వాగతం పలికిన మంత్రులు

cm kcr
cm kcr

విజయవాడ: తెలంగాణ సియం కేసిఆర్‌ విజయవాడ చేరుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపి సియంను ఆహ్వానించడానికి వచ్చిన కేసిఆర్‌కు గన్నవరం విమానాశ్రయంలో ఏపి మంత్రులు ఘనస్వాగతం పలికారు.
గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కేసిఆర్‌ హోటల్‌కు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం 2.15 గంటలకి బయలుదేరి ఏపి సియం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసానికి చేరుకుంటారు. అక్కడ విందు చేస్తారు. అనంతరం కాళేశ్వరం ప్రాజక్టు ప్రారంభోత్సవానికి జగన్‌ను కేసిఆర్‌ ఆహ్వానిస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఏపి రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు హోటల్‌కు చేరుకుని, 5 గంటలకు గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి బయల్దేరుతారు. అక్కడ విశాఖ శ్రీ శారదపీఠ ఉత్తరాధికారి శిష్య తురియాశ్రమ స్వీకార మహోత్సవంలో పాల్గొంటారు. రాత్రి అక్కడ 7.40కి ప్రత్యేక విమానంలో బయల్దేరి 8.35కి హైదరాబాద్‌ చేరుకుంటారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/