మోడి అపాయింట్‌మెంట్‌ కోసం చూస్తున్న సిఎం కెసిఆర్‌

CM KCR
CM KCR

ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అపాయింట్‌మెంట్‌ కోసం వేచి చూస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌. ఆయన నిన్న ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. కాగా ఇంకా ఆయన ప్రధానిని కలవనేలేదు. అయితే అపాయింట్‌మెంట్‌ లభిస్తే ఈ రోజుకానీ, రేపు కానీ సిఎం కెసిఆర్‌ ప్రధాని మోడిని కలిసే అవకాశం ఉంటుంది. ఒకవేళ అపాయింట్‌మెంట్‌ లభించకపోతే మాత్రం ఆయన ఈ సాయంత్రమే హైదరాబాద్‌కు తిరిగి పయనమవుతారని సిఎంవో వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోడిని కలిసే అవకాశం కనుక లభిస్తే రాష్ట్ర విభజన అంశంతోపాటు ఐఐఎం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఇంకా వివిధ అంశాలపై సిఎం కెసిఆర్‌ ప్రధాని నరేంద్ర మోడితో ప్రస్తావించనున్నట్లు సమాచారం. మరోవైపు నేడు సాయంత్రం పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ శర్మ తనయుడి వివాహ రిసెప్షన్‌కు హాజరు కానున్నారని తెలస్తుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/