వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసిన సీఎం కేసీఆర్

cm kcr

సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కంటి వెలుగు పథకం రెండవ విడత కార్యక్రమం ప్రారంభం కానున్న తరుణంలో వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ఆదేశించారు. ఈ కార్యక్రమం కొనసాగినన్ని రోజులు వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ రోజు తప్ప మిగిలి అన్ని రోజులు వైద్య సిబ్బంది కంటి వెలుగు కార్యక్రమాలలో పాల్గొనాలని ఆదేశాలు జారీచేసింది. సోమవారం కూడా విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. ఎవరైనా విధులకు హాజరు కాకపోతే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది వైద్యశాఖ.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన కంటి వెలుగు పధకం మళ్లీ ప్రారంభం కాబోతుంది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18 తేదీ నుంచి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం మొదలుకాబోతుంది. ఇప్పటికే పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ల నియామకానికి మార్గదర్శకాలను విడుదల చేసింది రాష్ట్ర సర్కార్. కంటి వెలుగు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1491 వైద్య బృందాలను ఏర్పాటు చేసింది.

రెండో విడుత కంటి వెలుగు కార్య‌క్ర‌మానికి రూ. 200 కోట్ల నిధులను విడుదల చేసింది. అందరు కలిసి ఉత్సాహంగా పని చేసి కంటి వెలుగు-2ని విజయవంతం చేయాల‌ని వైద్యారోగ్య శాఖ‌ మంత్రి హరీశ్‌రావు కోరడం జరిగింది.