సింగ‌రేణి ఉద్యోగుల‌కు సీఎం కేసీఆర్ దసరా తీపి కబురు

సింగ‌రేణి ఉద్యోగుల‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు తెలిపారు. 2021–22 ఏడాదికి గాను సంస్థ లాభాల నుంచి ఉద్యోగులకు 30 శాతం బోనస్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దసరాలోపు వెంటనే చెల్లించాల్సిందిగా, సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్‌కు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు ఉత్తర్వులు జారీ చేశారు. ద‌స‌రా పండుగ లోపు ఈ వాటాను ఉద్యోగుల‌కు చెల్లించాల‌ని సీఎం ఆదేశించారు. అర్హులైన కార్మికుల‌కు రూ. 368 కోట్ల‌ను సింగ‌రేణి సంస్థ చెల్లించ‌నుంది.