ఢిల్లీకి బయలుదేరిన సిఎం కెసిఆర్‌

cm kcr
cm kcr

హైదరాబాద్‌: తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గౌరవార్థం.. ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం ఇవ్వనున్న విందుకు హాజరుకానున్న కెసిఆర్‌… ఇక, ఈ సందర్భంగా డొనాల్డ్‌ ట్రంప్‌, మెలానియా ట్రంప్‌, ఇవాంక ట్రంప్‌ ల కోసం ప్రత్యేకమైన గిఫ్ట్‌లను తీసుకెళ్తున్నారు. అమెరికా అధ్యక్షుడిని పోచంపల్లి శాలువాతో కప్పి చార్మినార్‌ మెమెంటోను తెలంగాణ సిఎం కెసిఆర్‌ అందించనున్నారు. మెలానియా, ఇవాంక ల కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన పోచంపల్లి, గద్వాల్‌ చీరలను సిఎం కెసిఆర్‌ బహూకరించనున్నారు. సిఎం కెసిఆర్‌ తోపాటు లోకసభలో టిఆర్‌ఎస్‌ పక్ష నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌, బి.వినోద్‌ కుమార్‌ లు కూడా ఉన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/