వరంగల్ పర్యటనకు బయల్దేరిన సిఎం కెసిఆర్

హైదరాబాద్‌ః సిఎం కెసిఆర్ నేడు వరంగల్ జిల్లా పర్యటనకు బయల్దేరారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వరంగల్‌కు కెసిఆర్ వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ టు వరంగల్ వెళ్లే మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ములుగు రోడ్డులో నిర్మించిన ప్రతిమ (ప్రతిమ రిలీఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) మెడికల్ కాలేజీ హాస్పిటల్, క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ను కెసిఆర్ ప్రారంభించనున్నారు. కాలేజీ ప్రారంభోత్సవం అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్తారు. వైద్యారోగ్య మంత్రి హరీశ్‌రావు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొననున్నారు.
కాగా, వరంగల్ భద్రకాళీ అమ్మవారిని కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ దర్శించుకునే అవకాశాలున్నాయి. కాకతీయ వైద్య కళాశాల ఆవరణలో ఉన్న కాకతీయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సీఎం సందర్శించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకల్లా వరంగల్ జిల్లా పర్యటన ముగించుకుని సీఎం…హైదరాబాద్ బయలు దేరి వెళతారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/