రెండు రోజుల పర్యటనకు బయల్దేరిన సిఎం

ts cm kcr
ts cm kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ రెండు రోజుల పర్యటనలో భాగంగా పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం సిఎం కెసిఆర్‌ ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ నుంచి పెద్దపల్లి జిల్లాలోని రామగుండం పర్యటనకుబయల్దేరారు. మరికాసేపట్లో రామగుండం ఎన్టీపీసీని సీఎం కేసీఆర్‌ సందర్శించనున్నారు. తరువాత ఎన్టీపీసీ, జెన్‌కో అధికారులతో కేసీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈరోజు రాత్రికి ఎన్టీపీసీలోని జ్యోతిభవన్‌లో కేసీఆర్‌ బస చేస్తారు. ఇక రేపు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దేవాలయాన్ని కేసీఆర్‌ సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కన్నెపల్లి పంపు హౌస్‌, మేడిగడ్డ బరాజ్‌ పనులను కేసీఆర్‌ పరిశీలించనున్నారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/