భ‌ట్టి విక్ర‌మార్క‌పై ధ్వ‌జ‌మెత్తిన సీఎం కెసిఆర్

హైదరాబాద్: మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌‌మావేశాలు ప్రారంభమైన అనంతరం గవ‌ర్నర్‌ ప్రసం‌గా‌నికి ధన్య‌వా‌దాలు తెలిపే తీర్మా‌నంపై ఎమ్మెల్యే భ‌ట్టికి మాట్టాడారు. అయితే తనకు ఇచ్చిన స‌మ‌యం మించిపోవ‌డంతో స్పీక‌ర్ పోచారం మ‌రో స‌భ్యుడికి అవ‌కాశం ఇచ్చారు. దీంతో భ‌ట్టి మాట్లాడుతూ.. త‌మ‌కు త‌గిన స‌మ‌యం కేటాయించ‌క‌పోవ‌డం స‌రికాద‌న్నారు.

ఈ క్ర‌మంలో సీఎం కెసిఆర్ జోక్యం చేసుకున్నారు. స్పీక‌ర్‌ను కూడా నిర్దేశించే ప‌ద్ధ‌తి భ‌ట్టి విక్ర‌మార్క‌కు స‌రికాద‌న్నారు సీఎం కెసిఆర్. స‌భ‌లో ఇలా మాట్లాడ‌టం భ‌ట్టి విక్ర‌మార్క‌కు పరిపాటిగా మారింది. 26వ తేదీ వ‌ర‌కు బ‌డ్జెట్ సెష‌న్ ఉంట‌ది. ప‌ద్దుల‌పై చ‌ర్చ సంద‌ర్భంగా కూడా మాట్లాడొచ్చు. ఇప్ప‌టికే చాలా స‌మ‌యం ఇచ్చారు. స‌భ్యుల సంఖ్య‌ను బ‌ట్టి, స‌భా నియ‌మాలు పాటిస్తూ ముందుకు పోవాల‌న్నారు. కేటాయించిన స‌మ‌యం కంటే నాలుగైదు నిమిషాలు ఎక్కువ‌గానే ఇస్తున్నాం. స‌భ‌కు రావొద్ద‌ని మేమేందుకు చెప్తామ‌ని సీఎం అన్నారు. స‌భ‌కు రావొద్ద‌ని చెప్పే అవ‌స‌రం త‌మ‌కు ఎందుకుంటుంది. ఇలా మాట్లాడ‌టాన్ని అంగీక‌రించ‌ము అని కెసిఆర్ స్ప‌ష్టం చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/