రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిసిన సిఎం కెసిఆర్

హైదరాబాద్‌ః ఈరోజు సద్దుల బతుకమ్మ ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని సీఎం దుర్గామాతను వేడుకున్నారు. తొమ్మిది రోజులపాటు సాగిన బతుకమ్మ పండుగ ఆడబిడ్డల ఆటపాటలతో పల్లెలు, పట్టణాలు సాంస్కృతిక వాతావారణాన్ని సంతరించుకున్నాయని పేర్కొన్నారు. బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతమయ్యాయని సిఎం కెసిఆర్ చెప్పారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒకరికీ సీఎం అభినందనలు తెలిపారు. అందరూ కూడా శాంతియుతంగా దసరా వేడుకలను జరుపుకోవాలని సీఎం కోరారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/