సీఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన..నేడు వివిధ రంగాల ప్రముఖులతో భేటీ

న్యూఢిల్లీ: సీఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు నేడు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీకానున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీల నేతలు, ఆర్థికవేత్తలు, మీడియా సంస్థల ప్రముఖులు, రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.

పదిరోజుల పర్యటనలో భాగంగా ఆదివారం సీఎం కేసీఆర్‌.. చండీగఢ్ వెళ్లనున్నారు. రైతు ఉద్యమంలో చనిపోయిన ఆరు వందల రైతు కుటుంబాలను కేసీఆర్ పరామర్శిస్తారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు.

ఈనెల 26న బెంగళూరు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమార స్వామితో భేటీ అవుతారు. 27న సీఎం కేసీఆర్‌ మహారాష్ట్రలో పర్యటిస్తారు. రాలేగావ్ సిద్ధిలో అన్నహజారేతో భేటీ అవుతారు. మే 29, 30 తేదీల్లో బెంగాల్, బీహార్‌లో సీఎం కేసీఆర్ పర్యటన సాగుతుంది. గల్వాన్ లోయలో అమరులైన సైనిక కుటుంబాలను పరామర్శిస్తారు. సైనిక కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/