గెలిచిన ఎమ్మెల్సీ అభ్యర్ధులకు సియం అభినందనలు

CM KCR
CM KCR

హైదరాబాద్‌: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీల ఎన్నికల ఫలితాల్లో విజయ ఢంకా మోగించిన వారికి సియం కేసిఆర్‌ అభినందనలు తెలిపారు. మూడు స్థానాల్లోనూ టిఆర్‌ఎస్‌ సత్తా చాటడంతో ఆయన మరింత ఆనందానికి లోనయ్యారు. పట్నం మహేందర్‌రెడ్డి, చిన్నపరెడ్డి, శ్రీనివాసరెడ్డికి కేసిఆర్‌ అభినందనలు తెలిపారు. టిఆర్‌ఎస్‌కు ఏకపక్ష విజయాన్నందించిన స్థానిక సంస్థల ప్రతినిధులకు కూడా కేసిఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా టిఆర్‌ఎస్‌ అభ్యర్ధుల విజయానికి కృషి చేసిన ..మంత్రులు, ఎమ్మెల్యేలు ,ఎంపీలకు కూడా కేసిఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/