జయప్రకాశ్‌ రెడ్డి మృతి పట్ల సిఎం కెసిఆర్‌ దిగ్భ్రాంతి

cm kcr

హైదరాబాద్‌: ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్‌రెడ్డి ఈరోజు తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే జయప్రకాశ్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ సిఎం కెసిఆర్‌ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనేక సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించిన మంచి నటుడిగానే కాకుండా, గొప్ప రంగస్థల నటుడిగా కూడా జయప్రకాశ్ రెడ్డికి ప్రజల్లో అభిమానం ఉందని సిఎం తెలిపారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/