బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ మృతికి సిఎం సంతాపం

TS CM KCR
TS CM KCR

హైదరాబాద్‌: ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఈరోజు తెల్లవారుజామున ముంబయిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆమె మృతిపట్ల సిఎం కెసిఆర్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. హిందీ సినీ రంగంలో ఎన్నో చిత్రాలకు అద్భుతమైన కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన సరోజ్‌ఖాన్‌ మృతి సినిమా పరిశ్రమకు తీరని లోటని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని సిఎం కెసిఆర్‌ ప్రార్ధించారు. కాగా ఆమె మృతిపై బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం  చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/