బిజెపి ప్రభుత్వం తెలంగాణకు ఏం చేయలేదు

CM KCR at telangana assembly
CM KCR at telangana assembly

హైదరాబాద్‌: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సర్కారు తెలంగాణ రాష్ట్రానికి ఏం ఇవ్వలేదని ముఖ్యమంత్రి కెసిఆర్‌ విమర్శించారు. శాసనసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా సిఎం కెసిఆర్‌ మాట్లాడుతూ.. 50 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత బిజెపి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిందన్నారు. అయితే కాంగ్రెస్‌ పైన ప్రజలకు ఉన్న విసుగుతోనే బిజెపికి ఓటేశారని, అందువల్లనే బిజెపి గెలిచిందని అన్నారు. అలాంటిది ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బిజెపి దుర్వినియోగం చేస్తుందని కెసిఆర్‌ మండిపడ్డారు. పన్నులు వసూలు చేసే బాధ్యత మాత్రమే కేంద్రానిదని ఆయన అన్నారు. ప్రధాని మోడిని నమ్ముకంటే రాష్ట్రం పరిస్థితి అంతే అని స్పష్టం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national