నోముల అంత్యక్రియలకు హాజరైన సిఎం కెసిఆర్‌

పాలెం గ్రామంలో నోముల అంత్యక్రియలు

cm-kcr-attends-nomula-narsimhaiah-funerals

హైదరాబాద్‌: ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన అంత్యక్రియలు ఈరోజు నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో నిర్వహించారు. అంత్యక్రియలకు సిఎం కెసిఆర్‌ హాజరయ్యారు. నోముల భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నోముల కుటుంబసభ్యులను సిఎం కెసిఆర్‌ ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలులుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

నోముల అంత్యక్రియలు పాలెం గ్రామంలోని ఆయన స్వంత వ్యవసాయక్షేత్రంలో నిర్వహించారు. ఈ ఉదయం బేగంపేట నుంచి హెలికాప్టర్ లో పాలెం గ్రామం చేరుకున్న సిఎం కెసిఆర్‌… నోముల అంత్యక్రియలకు హాజరయ్యారు. దాదాపు గంట పాటు అక్కడే గడిపారు. కొద్దిసేపటి క్రితమే తిరిగి హైదరాబాద్ చేరుకున్నట్టు తెలుస్తోంది. నోముల నర్సింహయ్య హైదరాబాదులో మంగళవారం తెల్లవారుజామున తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. ఆయనను హైదర్ గూడ అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆయన ప్రాణాలు విడిచినట్టు వైద్యులు నిర్ధారించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/