సీఎం జగన్ కు ఓర్వకలు ఎయిర్ పోర్ట్ లో ఘ‌న స్వాగ‌తం

అమరావతి: సీఎం జగన్ కు ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ లో పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు , కర్నూలు రేంజ్ డీఐజీ ఎస్ సెంథిల్ కుమార్. ఏపీఎస్పీ బెటాలియన్ హెలిప్యాడ్ లో ఓర్వ‌క‌ల్లు చేరుకున్నారు సీఎం. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులను ఆప్యాయంగా పేరుపేరునా పలకరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి ..అర్జీలు అందజేశారు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు. అనంతరం ఏపీఎస్పీ బెటాలియన్ హెలిప్యాడ్ నుంచి సీఎం కాన్వాయ్ రోడ్డు మార్గాన బయలుదేరి బళ్లారి చౌరస్తా ఫ్లైఓవర్ మీదుగా, కృష్ణానగర్ పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి నివాస గృహానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి స్వాగతం పలికిన పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ కుమార్ రెడ్డి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/