ప్రతి రంగంలోనూ మహిళలు అభివృద్ధి చెందాలి..జగన్

సీఎం క్యాంప్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు

YouTube video
CM jagan Will Participate in International Women’s Day Celebration at Camp Office LIVE

తాడేపల్లి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్ధిక, సామాజిక, రాజకీయంగా మహిళలకు హక్కులు కల్పించాలని అన్నారు. కుటుంబానికి చుక్కానిలా ఉండి అందిస్తున్న సేవలకు కొలమానాలు లేవన్నారు.

గత 21 నెలల్లో రాష్ట్ర మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టాం. అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, కాపు నేస్తం మహిళల పేరిట ఇళ్ల స్థలం, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు వంటి పథకాలు తెచ్చాం ప్రతి రంగంలోనూ మహిళలు అభివృద్ధి చెందాలి అన్నారు. ఈసందర్బంగా సీఎం జగన్ 900 దిశ పెట్రోల్‌ వెహికల్స్‌, 18 దిశ క్రైం సీన్‌ మేనేజ్‌మెంట్‌ వెహికల్స్‌ను ప్రారంభించారు. జీపీఎస్‌, దిశ యాప్ రెస్పాన్స్ సిస్టమ్‌తో అనుసంధానం చేసే సైబర్ కియోస్క్‌లను సీఎం ఆవిష్కరించారు. బాలికలకు ఉచిత నాప్‌కిన్స్ అందించే స్వేచ్ఛ కార్యక్రమాన్ని కూడా సీఎం జగన్‌ ప్రారంభించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/