శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్‌ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

YouTube video
Hon’ble CM of AP will be Inaugurating Sri Padmavathi Children’s Heart Centre at BIRRD Hospital LIVE

తిరుపతి : సీఎం జగన్ తిరుమలలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన తిరుపతి బర్డ్‌ ఆసుపత్రిలో శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్‌ సెంటర్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు.

అనంతరం అలిపిరి వద్దకు చేరుకుని శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడక మార్గం, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభించనున్నారు. సాయంత్రం తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని స్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారి దర్శనం అనంతరం ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకుని, రాత్రికి అక్కడే బస చేస్తారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/