దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక సాయం: సీఎం జగన్‌

దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక సాయం: సీఎం జగన్‌
వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమంను ప్రారంభించిన సిఎం జగన్‌

YouTube video
Hon’ble CM will be Distributing Financial Assistance to the Beneficiaries under Y.S.R Vahana Mithra

అమరావతిః సిఎం జగన్‌ వాఖపట్నంలో వాహనమిత్ర లబ్ధిదారులకు 4వ ఏడాది రూ.10వేల సాయాన్ని విడుదల చేశారు. ఒక్కో లబ్ధిదారునికి రూ.10వేల చొప్పున మొత్తం రూ.261.51 కోట్లను సీఎం జగన్‌ బటన్‌నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ వాహన మిత్ర ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు. ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున 261.51 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత వాహనం కలిగిన వారికి ఆర్థిక సాయం అందజేస్తున్నామని సీఎం అన్నారు. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందచేస్తున్నామన్నారు. తమకు తామూ స్వయం ఉపాధి కల్పించుకుని.. ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారన్నారు.

నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని చెప్పిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే వాహనమిత్ర పథకం ప్రారంభించామని సీఎం జగన్‌ అన్నారు. కరోనా సమయంలోనూ వాహన మిత్ర పథకం అమలు చేశాం. మనది పేదల ప్రభుత్వం.. పేదలకు అండగా ఉండే ప్రభుత్వమని సీఎం అన్నారు. మూడేళ్లలో రూ.1.65 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని సీఎం జగన్‌ అన్నారు. ఎక్కడా కూడా లంచాలు లేవు, వివక్ష లేదన్నారు. కులం చూడలేదు, పార్టీ చూడలేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. అప్పటి ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వానికి ఉన్న తేడా గమనించాలని సీఎం కోరారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/