కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

ఆదివారం కనకదుర్గమ్మకు రాష్ట్రం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలను పుర‌స్క‌రించుకొని మూలాన‌క్ష‌త్రం (అమ్మ‌వారి జ‌న్మ‌న‌క్ష‌త్రం) రోజున దుర్గ‌మ్మ స‌ర‌స్వ‌తీ దేవి అలంక‌ర‌ణ‌లో భ‌క్తుల‌కు దర్శనం ఇచ్చారు. అమ్మ‌వారి జ‌న్మ‌న‌క్ష‌త్రం రోజు సందర్బంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు.

మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే ఆనవాయితీని కొనసాగిస్తూ.. సీఎం జగన్ ఇంద్రకీలాద్రిని సందర్శించారు. సీఎంకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్చకులు ఆయన తలకు పరివేష్టం చుట్టారు. పట్టువస్త్రాలు, పసుపు-కుంకుమ సమర్పించిన ముఖ్యమంత్రి జగన్.. అమ్మవారిని దర్శించుకున్నారు. పండితులు వేద ఆశీర్వచనం పలికి, తీర్థప్రసాదాలు అందించారు.