జగన్‌కు ఆహ్వానం పలికిన కెసిఆర్‌

cm jagan,cm kcr
cm jagan,cm kcr

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిఎం కెసిఆర్‌, సిఎం జగన్‌లు హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసిన సిఎం కెసిఆర్‌ సాదరంగా ఆహ్వానం పలికారు.కెసిఆర్‌ తో పాటు టీఆర్ఎస్ నేత వినోద్ తదితరులు ఉన్నారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం, నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/