నేడు చిత్తూరు జిల్లాకు సిఎం జగన్‌

cm jagan
cm jagan

చిత్తూరు: ఏపి సిఎం జగన్‌ ఈరోజు జిల్లాకు వస్తున్నట్లు కలెక్టర్‌ భరత్‌ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం బయల్దేరి 10.15 గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడినుంచి నెల్లూరు జిల్లాలో జరిగే వైఎస్సార్‌ రైతు భరోసా సదస్సులో పాల్గొనడానికి హెలికాప్టర్‌లో వెళతారు. కార్యక్రమం ముగిశాక తిరిగి హెలికాప్టర్‌లో బయల్దేరి మధ్యాహ్నం రెండు గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. తర్వాత గన్నవరానికి ప్రత్యేక విమానంలో తిరుగుప్రయాణం అవుతారని కలెక్టర్‌ పేర్కొన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/