జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సిఎం జగన్‌ సమీక్ష

AP CM YS Jagan
AP CM YS Jagan

అమరావతి: సిఎం జగన్‌ స్పందన కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ళనాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, చీఫ్‌ సెక్రటరీ నీలంసాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం మంచి పరిణామం అని అన్నారు. పాజిటివిటీ రేట్‌ 12.0 నుంచి 8.3కి తగ్గిందని తెలిపారు. టెస్టులు పెరిగాయని, కేసులు కూడా తగ్గుతున్నాయని సిఎం పేర్కొన్నారు. కోవిడ్‌ తగ్గుతుందనడానికి ఇది నిదర్శనమని, కోవిడ్‌తో సహజీవనం చేస్తూనే, అప్రమత్తంగా ఉండాలని సిఎం ‌జగన్‌ సూచించారు. జనవరికల్లా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం కనిపిస్తుందన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/