పింగళి వెంకయ్య సేవలు ఎల్లప్పుడు గుర్తుండి పోతాయి

Jagan
Jagan

అమరావతి: నేడు జాతీయ పతాక రూపశిల్పిపింగళి వెంకయ్య జయంతి ఈ సందర్భంగా ఏపి సిఎం జగన్‌ పింగళి వెంకయ్య అందించిన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండి పోతాయని ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. ఏపీకి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడిగా ఆయన పోరాటం సదా స్మరణీయమన్నారు.
మరోవైపు టిడిపి అధినేత చంద్రబాబు భారతదేశానికి జాతీయపతాకాన్ని అందించిన గౌరవం తెలుగువారికి దక్కించిన మహనీయుడు పింగళి వెంకయ్యఅని తన ట్విటర్‌లో తెలిపారు. వందేమాతరం, హోమ్‌రూల్ వంటి ఉద్యమాల్లో పింగళి పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శనీయమన్నారు.
కాగా పింగళి వెంకయ్య 142వ జయంతి వేడుకలను విశాఖలో నిర్వహించారు. ఈ సందర్భంగా 100 అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/